ePaper
Saturday, April 4, 2026
Homeఆంధ్రప్రదేశ్13వ వార్డులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

13వ వార్డులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

📰 Generate e-Paper Clip

13వ వార్డులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

విశాఖపట్నం, మార్చి 29 (సిటిజన్ టైమ్స్): విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు ఆదేశానుసారం, 13వ వార్డు అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు ఆధ్వర్యంలో, వార్డు మాజీ కార్పొరేటర్ శ్రీమతి కెల్లా సునీత సమక్షంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సెక్టార్-4, వెర్నిదుర్గా నగర్‌లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద మరియు వార్డు కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వార్డు అధ్యక్షులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు అమలు చేసిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

తదుపరి లక్ష్మీనగర్, రామకృష్ణాపురం, శ్రీకృష్ణాపురం, జెఎన్ఎన్యూఆర్‌ఎం కాలనీ, పైనాపిల్ కాలనీ, ఎస్‌ఎస్‌ఎన్ నగర్ ప్రాంతాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి, పార్టీ జెండాలు ఎగరవేశారు.

ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి పొత్రకండ ధర్మారావు, వార్డు ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి, సీనియర్ నాయకురాలు నల్లాని వరలక్ష్మి, విశాఖ తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పట్టా నూకరాజు, అలాగే వార్డు అనుబంధ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!